Overview

నీట్ అభ్యర్థులకు అలర్ట్! చేతులకు మెహందీ ఉంటే పరీక్షకు నో ఛాన్స్.. NTA షాకింగ్ రూల్స్! Jobs in Meredale, Gauteng, South Africa at AGA Publications Ltd

Title: నీట్ అభ్యర్థులకు అలర్ట్! చేతులకు మెహందీ ఉంటే పరీక్షకు నో ఛాన్స్.. NTA షాకింగ్ రూల్స్!

Company: AGA Publications Ltd

Location: Meredale, Gauteng, South Africa

NEET 2026: దేశవ్యాప్తంగా మే 3వ తేదీన జరగనున్న నీట్ (NEET-UG 2026) పరీక్ష కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. పరీక్షలో అక్రమాలకు తావులేకుండా ఈసారి డ్రెస్ కోడ్ నుంచి వెరిఫికేషన్ వరకు అత్యంత కఠినమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యార్థులు ఏమరపాటుగా ఉన్నా పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

Read Also: AP 10th Supplementary Exams: ఏపీ టెన్త్ సప్లిమెంటరీ షెడ్యూల్ విడుదల.. ఫీజు వివరాలు ఇవే!

బయోమెట్రిక్ వెరిఫికేషన్‌లో మార్పులు:

పరీక్షా కేంద్రంలో అభ్యర్థుల గుర్తింపు కోసం బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఒకవేళ వేలిముద్రలు సరిపోలక బయోమెట్రిక్ సమస్యలు ఎదురైతే.. అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన పనిలేదని ఎన్‌టీఏ తెలిపింది. అలాంటి వారి కోసం ఐరిస్ స్కాన్ (కంటి పాప స్కానింగ్), మ్యాన్యువల్ వెరిఫికేషన్, అండర్‌టేకింగ్ ఫామ్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అందుబాటులో ఉంచనుంది.

NEET 2026: మెహందీపై నిషేధం:

బయోమెట్రిక్ వేలిముద్రలు సక్రమంగా పడాలంటే చేతులు శుభ్రంగా ఉండాలని ఎన్‌టీఏ సూచించింది. అందుకే అభ్యర్థులు చేతులకు ఎలాంటి రంగులు, మెహందీ (గోరింటాకు) వంటివి అంటించుకోవద్దని స్పష్టం చేసింది. వీటివల్ల వేలిముద్రలు గుర్తించడంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది.

కఠినంగా డ్రెస్ కోడ్:

పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులు ధరించే దుస్తులపై కూడా ఆంక్షలు విధించారు.

  • పురుషులు: అభ్యర్థులు హాఫ్ హ్యాండ్స్ షర్ట్స్ (సగం చేతులున్న చొక్కాలు) మాత్రమే ధరించాలి. షూస్ ధరించకూడదు, కేవలం స్లిప్పర్లు లేదా తక్కువ హీల్ ఉన్న శాండల్స్ మాత్రమే వాడాలి.
  • మహిళలు: సాధారణ దుస్తులు ధరించాలి. ఫ్లాట్ స్లిప్పర్లు మాత్రమే అనుమతించబడతాయి. గొలుసులు, ఉంగరాలు, ముక్కుపుడకలు, కమ్మలు వంటి ఎటువంటి ఆభరణాలను ధరించకూడదని ఎన్‌టీఏ స్పష్టం చేసింది.

పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ నిబంధనలను క్షుణ్ణంగా చదువుకుని, పరీక్షా కేంద్రానికి ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also

GST కలెక్షన్లలో ఇండియా సరికొత్త రికార్డు!

Upload your CV/resume or any other relevant file. Max. file size: 800 MB.